డాన్సుల్లో చిరంజీవికి ఇన్స్పిరేషన్.. జ్యోతిలక్ష్మి!
on Sep 14, 2021
తెలుగు ప్రేక్షకులకు స్పీడ్ డాన్స్, డిస్కో డాన్స్, బ్రేక్ డాన్స్ లాంటి వాటిని పరిచయం చేసింది ఎవరంటే.. ఎవరైనా ఠక్కున చేప్పేస్తారు.. చిరంజీవి అని. తెలుగు సినిమాల్లో అప్పటిదాకా కనిపించిన డాన్సులు వేరు.. చిరంజీవి వచ్చాక ఆ డాన్సుల తీరు మారిపోయింది. హీరో కూడా అందంగా, సొగసుగా ఒక గ్రేస్తో డాన్స్ చేయగలడని చిరంజీవి నిరూపించారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వచ్చే దాకా తెలుగు సినిమాల్లో డాన్సులంటే చిరంజీవివే అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది.
చిరంజీవి అంత నైపుణ్యంగా డాన్సులు వేయడానికి కారణం ఎవరో తెలుసా? నిన్నటి తరం శృంగార తార.. జ్యోతిలక్ష్మి! ఏంటీ.. ఆశ్చర్యంగా ఉందా? అలా అని చిరంజీవే స్వయంగా ఒకసారి చెప్పారు. "నేను హైస్కూలు చదివేప్పట్నుంచీ జ్యోతిలక్ష్మిగారి సినిమాలు తెగ చూస్తూ వచ్చాను. కాలేజీకొచ్చాక ఆమె సినిమా చూసి, ఆమె చేసిన విధంగా ఒక గదిలో డాన్స్ చేసేవాడ్ని. ఆవిధంగా నేను జ్యోతిలక్ష్మిగారికి ఏకలవ్య శిష్యుడ్ని" అని చెప్పారు చిరంజీవి.
అలా డాన్సులో తన ఆరాధ్య తార అయిన జ్యోతిలక్ష్మితో కలిసి నటించే చాన్స్ ఆయనకు వచ్చినప్పుడు, తన అభిమానం విషయం ఆమెకు చెప్పారంట. అప్పటికే హీరోగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. మొదట ఆశ్చర్యపోయిన జ్యోతిలక్ష్మి, ఆ తర్వాత నవ్వుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారట. నిజంగానే జ్యోతిలక్ష్మి అద్భుతమైన డాన్సర్ అనే విషయం మనకు తెలుసు. ఆమె భారీ శరీరానికీ, ఆమె చేసే డాన్సుకు సంబంధం లేదన్నట్లు గొప్పగా డాన్స్ చేసేవారామె. అలా ఆమె ఇన్స్పిరేషన్తో డాన్సులు చేస్తూ, ఆ విషయంలో తిరుగులేని హీరోగా చిరంజీవి పేరు తెచ్చుకున్నారు.
Also Read